Monday, 22 October 2018

సీతాలాలి లోకమాతాలాలి
రచన : శ్రీమతి వేమూరి సరోజనీ శాస్త్రీగారు, ఆనందభైరవిరాగం, ఆదితాళం

పల్లవి :
సీతా లాలి లోకమాతా లాలి
దివి నుండి భువికి దిగి వచ్చిన దయామయి లాలి

చరణం :
నాగేటి చాలు లో దొరికిన లక్ష్మీ లాలి భాగ్యలక్ష్మీ లాలి
జనకుని తపము పండగ వచ్చిన జానకి లాలి
…..సీతాలాలి….

మల్లెల మొల్లల జాజుల పానుపు పరచితినోయమ్మా
అల్లరి సేయక ఉల్లమలరగా నిదురించవే అమ్మా
….సీతాలాలి…

లాలి లాలనుచు పాడే భాగ్యము మాకిచ్చిన తల్లి
పదసరోజముల శరణ మిచ్చి మము కాపాడవే తల్లి
……...సీతా లాలి……

No comments:

Post a Comment