Thursday, 25 October 2018

గంధము పూయరుగా - పన్నీరు గంధము పూయరుగా 
అందమైన యదు నందను పై కుందరదన లిరు వందగ పరిమళ
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా 
కల కల మను ముఖ కళదని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి
చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా 
మాలిమితో గోపాల బాలురతో ఆలమేపిన విశాల నయనునికి
హారతులెత్తరగా ముత్యాల హారతులెత్తరుగా 
నారీ మణులకు వారము యవ్వన వారక మొసగెడు వారిజాక్షనుకు
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా 
జాజులు మరి విరజాజి దవనములు రాజిత త్యాగరాజ వినుతునికి

No comments:

Post a Comment