Sunday, 7 October 2018


https://www.youtube.com/watch?v=9LP4Y4zteME&feature=youtu.be


కురిసే వానలతో వాగులన్నీ పారినయీ
సిరుల చెరువులతో బావులన్నీ నిండినయి
పల్లె కరువు దీర పంటలతో మురిసినదీ
ఎదలో ప్రేమలన్ని పువ్వులలో పేర్చినదీ
పొద్దు పొద్దున ముద్దూ ముద్దుగ
పుడమీ పూలు పూసిందో మొగులూ చూసి మురిసిందో
పువ్వులు దెంపి ఆడాబిడ్డలు పూలరాశి పోసిండ్రో
పూజలు జేసి పాడిండ్రో
మంచి మంచి పూవులేరి మనసే పేర్చినారమ్మో రంగులు అద్దినారమ్మో
బజార్లల్ల గుంపులు గుంపులు బాజా మోతలు మోగెనో బతుకమ్మలు కదిలెనో
తీరు తీరు పాటలు వినీ తారతారలు ఆగిండ్రో తప్పెట తాళమేసిండ్రో
కోటికోట్ల దేవతలంతా కొత్త కొలువుదీరిండ్రో తలలూపి మెచ్చిండ్రో
కచ్చీరేమె దుమ్ములేపె జోటా బాటల ఆటల్లో ఆడి బిడ్డల పాటల్లో
స్త్రీల జాతర పూల జాతర ఊదు పొగల జాతర ఊరి జనుల జాతర
అన్నా చెల్లి ప్రేమలనల్లి కన్న తల్లి మురిసెరో చిన్నానాటి స్నేహితులంతా చేరి ముచ్చెటలాడెరో
వాడావాడా వయ్యారాలతో వాయినాలిచ్చే
పాలాపిట్టా సారెలు పెట్టి పండుగ జేసే
ఊరి చెరువు అలల పూలు ఉయ్యాలలూగే
తారలేమొ సిగ్గుతోని తలలు వంచె
సాగిరారె చెలియలారా సద్దుల బతుకమ్మా
పాడరారె కోయిలలారా బంగరు బతుకమ్మా
కొలువరారె కలువలార గౌరీ బతుకమ్మా
ఆడరారె హంసలారా అందరి బతుకమ్మ
డప్పు డప్పుల దరువేస్తుంటే పూలు పాట పాడెనో గాలి ఈల లేసెనో
తెలంగాణ ముద్దు గుమ్మలు పట్టు చీరల మెరిసిండ్రో
ముచ్చటలాడి మురిసిండ్రో
శ్రీ గణేశా నిను ఉయ్యాలో చిత్తాములో నిలిపి ఉయ్యాలో
మల్లెపూల తోడ ఉయ్యాలో మహదేవ నిను గొలుతు
రంగురంగుల పూలు  రాణి తంగేడు పూలు
వనమువనముల పూలు  మన ఇంటికొచ్చేనె
సందుసందులు తిరిగె  సద్దుల బతుకమ్మ
ఊరూరి ప్రేమలో మన ఊరికొచ్చేనె
చెట్టూగట్టూ చిగురులు జూసి చెరువు తల్లి మెచ్చెనో
గోరువంక పాలకంకి జోరు మీద ఉన్నయో
చినుకుచినుకూ చిందేస్తుంటే సింగిడి వెలిసే
అవ్వల మాట బతుకమ్మలు తొవ్వబట్టె
వరుసవరుసన ఒడ్డున జేరి సరసాలాడె
సంబురంగా తాంబాలాలు సందడి జేసే
ఇంపుపూలు తెంపు కొచ్చి ఇల్లు వనము జేసినారు
ఇంతిఇంతి చేయి వేసి ఇంద్రధనుసులద్దినారు
పడతి పడతి పూనుకొని పర్వతాలు దించినారు
నింగి తొంగి చూసెరో సురులు చూడవచ్చిరో
గడియ గడియ గలుమ గలుమ గాలి ఈలలేసెరో గజ్జెలు తాళమేసెరో
వీధివీధుల ఊదుబత్తుల పొగలు మేఘాలాయెరో పువ్వులు రాగాలయ్యెరో
వెడలే ప్రేమలతో పాటలతో వేడుకలే పోయి రావమ్మా బతుకమ్మా వీడుకోలే
వచ్చే ఏడాది పండుగయి వద్దువులే పసిడి తెలంగాణ వెలుగులలో నిలవాలె


 ಕುರಿಸೇ ವಾನಲತೋ ವಾಗುಲನ್ನೀ ಪಾರಿನಯೀ
ಸಿರುಲ ಚೆರುವುಲತೋ ಬಾವುಲನ್ನೀ ನಿಂಡಿನಯಿ
ಪಲ್ಲೆ ಕರುವುದೀರ ಪಂಟಲತೋ ಮುರಿಸಿನದೀ
ಎದಲೋ ಪ್ರೇಮಲನ್ನೀ ಪುವ್ವುಲತೋ ಪೇರ್ಚಿನದೀ
ಪೊದ್ದು ಪೊದ್ದುನ ಮುದ್ದು ಮುದ್ದುಗ ಪುಡಮಿ ಪೂಲು ಪೂಸಿಂದೋ
ಮೊಗುಲು ಜೂಸಿ ಮುರಿಸಿಂದೋ
ಪುವ್ವುಲು ದೆಂಪಿ ಆಡಾ ಬಿಡ್ಡಲು ಪೂಲ ರಾಶಿ ಪೋಸಿಂಡ್ರೋ ಪೂಜಲು ಜೇಸಿ ಪಾಡಿಂಡ್ರೋ ಮಂಚಿ ಮಂಚಿ ಪುೂವುಲೇರಿ ಮನಸೇ ಪೇರ್ಚಿನಾರಮ್ಮಾ ರಂಗುಲು ಅದ್ದಿನಾರಮ್ಮಾ
ಬಜಾರ್ಲಲ್ಲ ಗುಂಪುಲು ಗುಂಪುಲು ಬಾಜಾ ಮೋತಲು ಮೋಗೆನೋ ಬತುಕಮ್ಮಲು ಕದಿಲೆನೋ
ತೀರು ತೀರು ಪಾಟಲು ವಿನೀ ತಾರತಾರಲು ಆಗಿಂಡ್ರೋ ತಪ್ಪೆಟ ತಾಳಮೇಸಿಂಡ್ರೋ
ಕಚ್ಚೀರೇಮೆ ದುಮ್ಮು ಲೇಪೆ ಜೋಟಾ ಬಾಟಲ ಆಟಲ್ಲೋ ಆಡಿ ಬಿಡ್ಡಲ ಪಾಟಲ್ಲೋ

कुरिसे वानलतो वागुलन्नी पारिनयि
सिरुल चॆरुवुलतो बवुलन्नी निंडिनयि
पल्लॆ करुवुदीर पंटलतो मुरिसिनदि
ऎदलो प्रेमलन्नी पुव्वुलतो पेर्चिनदि
पॊद्दु पॊद्दुन मुद्दु मुद्दुग
पुडमि पूलु पूसिंदो मॊगुलु जूसि मुरिसिंदो
कुरिसे वानलतो वागुलन्नी पारिनयि
सिरुल चॆरुवुलतो बवुलन्नी निंडिनयि
पल्लॆ करुवुदीर पंटलतो मुरिसिनदि
ऎदलो प्रेमलन्नी पुव्वुलतो पेर्चिनदि
पॊद्दु पॊद्दुन मुद्दु मुद्दुग 
पुडमि पूलु पूसिंदो मॊगुलु जूसि मुरिसिंदो
पुव्वुलु दॆंपि आडाबिड्डलु पूल राशि पोसिंड्रो पाजलु जेसि पाडिंड्रो












No comments:

Post a Comment