Wednesday, 24 October 2018

శివుని శిరసు పైన చిందులాడెడి గంగ
శ్రీ విష్ణు పాదమున వెలసీన గంగా
గౌరమ్మా పుట్టింట కాలు మోపిన గంగ
కవుల గంటముల కులికిన గంగ
ఉరవళ్ళ పరవళ్ళ ఊసులాడుకొనుచు
ఏరులలో వాగులలో జారిపోయే గంగ
నురుగులతో ముత్యాల మెరుపులతో కదలుచూ
పరుగులతో భూమిపై ప్రవహించే గంగ
జాబిల్లితో కలిసి ఆటలాడే గంగ
జాలరుల ఇంటాడపడుచైన గంగా
జీవ కోటుల ముఖ్య ప్రాణమైన గంగ
ఓషదుల పోషించూ వయ్యారి గంగా
భగీరథుని ముద్దు పాపా నీవే గంగా
సాగరుని మురిపించు చక్కనీ గంగ
లోకమున నివసించు ఆకాశ గంగా
నగ లోకమున వసియించు పాతాళా గంగా

No comments:

Post a Comment