Thursday, 25 October 2018



జయ జానకీ కాంత జయ సాధు జన వినుత
జయతు మహిమానంత జయ భాగ్యవంత
దశరథాత్మజ వీర దశకంఠ సంహార పశుపతీశ్వర మిత్ర పావన చరిత్ర
కుసుమ బాణ స్వరూప కుశల కీర్తి కలాప అసమ సాహస శిక్ష అంబుజ దళాక్ష
సామగాన విలోల సాధుజన పరిపాల కామితార్థ ప్రదాత కీర్తి సంజాత
సోమ సూర్య ప్రకాశ సకల లోకాధీశ శ్రీ మహారఘువీర సింధూ గంభీర
సకల శాస్త్ర విచార శరణుజన మందార వికసితాంబుజ వదన విశ్వమయ సదన
సుకృత మోక్షాధీశ సాకేత పురవాస భకుతవత్సల రామ పురందర విఠల

No comments:

Post a Comment