శ్రీ గణేశ్వర ఉయ్యాలో
శ్రీ గణేశ్వర ఉయ్యాలో
చిత్తంబు తోని ఉయ్యాలో
మదిలోన నిను తలచి ఉయ్యాలో
మందార పూలతో ఉయ్యాలో
మల్లె పువ్వులతోడ ఉయ్యాలో
మహదేవ నిను కొలతు ఉయ్యాలో
పొన్న పువ్వుల తోడ ఉయ్యాలో
పొగిడి పూజింతుము ఉయ్యాలో
సంపెంగ పువ్వులతో ఉయ్యాలో
ఇంపుగా పూజింతుము ఉయ్యాలో
కలువ పువ్వులతోటి ఉయ్యాలో
కొలుతుము నిను దేవ ఉయ్యాలో
ముక్కోటి దేవతలు ఉయ్యాలో
ముందుగా నీ పూజలు ఉయ్యాలో
సకల జనాలను ఉయ్యాలో
సర్వ లోకముల ఉయ్యాలో
కరుణించి కాపాడు ఉయ్యాలో
శరణు శివపుత్రుడా ఉయ్యాలో
కరుణించి కాపాడు ఉయ్యాలో
శరణు శివపుత్రుడా ఉయ్యాలో.
No comments:
Post a Comment