Monday, 22 October 2018


రామ భద్ర రారా శ్రీ రామ చంద్ర రారా
తామరస లోచనా సీతాసమేత రారా
ముద్దుముద్దుగా రారా నవమోహనాంగా రారా
అద్దంపు చెక్కిళ్ళ వాడా నీరజాక్ష రారా ||
పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారా
గట్టిగా కౌసల్యా ముద్దు పట్టి వేగ రారా ||
ముజ్జగముల ఆది మూల బ్రహ్మ రారా
గజ్జెలు చప్పుళ్ళు ఘల్లు ఘల్లుమనగ రారా ||
సామగాన లోల నా చక్కనయ్య రారా
రామదాసునేలిన భద్రాచలేంద్ర రారా
రామదాసునేలిన భద్రాచలేశ రారా ||

No comments:

Post a Comment